Monday, November 17, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుహైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి

- Advertisement -

స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌ ఆదివారం హైదరాబాద్‌ విచ్చేశారు. ఆయనకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయంలో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మర్యా దపూర్వకంగా స్వాగతం పలికారు. రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికిన వారిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, మేయర్‌ గద్వాల విజయ లక్ష్మి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, జిల్లా అదనపు కలెక్టర్‌ జి.ముకుందరెడ్డి, నాయకులు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -