Sunday, March 29, 2026
E-PAPER
Homeసినిమా'విచిత్ర' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘విచిత్ర’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

జ్యోతి పూర్వాజ్‌ ప్రధాన పాత్రలో, రవి, శ్రేయ తివారి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘విచిత్ర’. సిస్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై సైఫుద్దీన్‌ మాలిక్‌ నిర్మాణ, దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌, సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుని, మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర దర్శక, నిర్మాత సైఫుద్దీన్‌ మాలిక్‌ మాట్లాడుతూ, ”బేబీ’ శ్రీ హర్షిణి, రవి ప్రకాష్‌, సూర్య, ఛత్రపతి శేఖర్‌, మీనా వాసన్‌ ముఖ్య పాత్రలుగా నటించారు. ‘ప్రపంచం మొత్తం దూరమైన దగ్గరగా ఉండేది అమ్మ ప్రేమే’ అనే అంశంతో ప్రతి ఆడబిడ్డ గుండె తల్లడిల్లే సెంటిమెంట్‌ నేపథ్యంతో రూపొందిన సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ చూసే చిత్రం కూడా. నిజాని అంజన్‌ అందించిన మ్యూజిక్‌, అన్ని పాటలు బాగా వచ్చాయి. చిత్ర పాడిన తల్లి సెంటిమెంట్‌ సాంగ్‌ హైలెట్‌గా నిలుస్తుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -