Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబాధితులకు నష్టపరిహారం అందించాలి

బాధితులకు నష్టపరిహారం అందించాలి

- Advertisement -

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్‌
– బాధితులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట నిరసన
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌

ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలోని పిప్పల్‌కోటి గ్రామంలో వరదలతో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందించాలని, ఇందిర మ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా తరలివచ్చి బైటాయించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. వరదతో నష్టపోయిన పేదల ఇండ్లను అధికారులు పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించాలన్నారు. కొంతమందికే 10 కేజీల చొప్పున బియ్యం చెల్లించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, తక్షణ సహాయం కింద రూ.25 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు బండి దత్తాత్రి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌.మంజుల, నాయకులు ధొనిపెల్లి స్వామి, హరిఫా బేగం, బాధితులు ఎస్‌.స్వామి, కొలిపాక అశోక్‌, విలాస్‌, బహునే రాజు, రింగాని సురేఖ, వైశాలి, సుజాత, రాధ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad