Sunday, January 11, 2026
E-PAPER
Homeఖమ్మంసమన్వయంతోనే గెలుపు: ఎమ్మెల్యే జారె

సమన్వయంతోనే గెలుపు: ఎమ్మెల్యే జారె

- Advertisement -

– మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం 
నవతెలంగాణ – అశ్వారావుపేట

మున్సిపాల్టీగా అవతరించిన నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలో జరిగే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్‌ తో పాటు కౌన్సిలర్లుగా కాంగ్రెస్ ప్రతినిధులే గెలవాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పిలుపునిచ్చారు.

శనివారం స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రతి వార్డుకు పదిమందితో ఎన్నికల ప్రచారం,నిర్వహణ కోసం ప్రత్యేక సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి సిద్ధంగా ఉండాలని సూచించారు.మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన విధివిధానాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ప్రతి కార్యకర్త ప్రజల మధ్యే ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని, ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించాలని అన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తున్న పథకాల పై అవగాహన పెంచడం ద్వారా పార్టీకి బలమైన మద్దతు లభిస్తుందని తెలిపారు. అలాగే ఐక్యత, క్రమశిక్షణ, సమన్వయంతో కూడిన పని తీరే విజయానికి మార్గమని పేర్కొన్నారు.

ప్రతి వార్డు స్థాయిలో బూత్ కమిటీలను బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముందుంటుందనే నమ్మకాన్ని కల్పించాలని సూచించారు. నూతన మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో అశ్వారావుపేట ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు,అశ్వారావుపేట పాక్స్ మాజీ అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ,మొగళ్లపు చెన్నకేశవ రావు,కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు,నాయకులు జూపల్లి రమేష్,ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -