Tuesday, February 3, 2026
E-PAPER
Homeఖమ్మంసీపీఐ (ఎం), కాంగ్రెస్ శ్రేణులు ఐక్య కృషితో అన్ని వార్డుల్లో విజయం 

సీపీఐ (ఎం), కాంగ్రెస్ శ్రేణులు ఐక్య కృషితో అన్ని వార్డుల్లో విజయం 

- Advertisement -

– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

సీపీఐ (ఎం), కాంగ్రెస్ శ్రేణులు ఐక్య కృషి తో మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డు ల్లో విజయం సాధిస్తాం అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ భరోసా ఇచ్చారు. మంగళవారం కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ (ఎం) 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని తగరం నిర్మల గృహంలో ఎన్నికల సమన్వయ సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాజకీయ పొత్తు ధర్మాన్ని పాటించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ వార్డు విజయం ఇరుపార్టీల కు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం ( ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి, మండల కమిటీ కార్యదర్శి సోడెం ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు చీమకుర్తి వెంకటేశ్వరరావు,కేపీ ఇబ్రహీం, కావూరి మోహన్,తగరం ముత్తయ్య, నారాయణపురు ఉపసర్పంచ్ ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -