- Advertisement -
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం, గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజే లు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఆంక్షలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల నియమాలను అతిక్రమిస్తే చట్టపరమైన తీసుకుంటాని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరికీ బాధ్యత అన్నారు.
- Advertisement -



