Tuesday, June 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజయోత్సవ ర్యాలీ

కాటాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజయోత్సవ ర్యాలీ

- Advertisement -

విద్యా సంవత్సరంలో విన్నూత్న రీతిలో బడిబాట కార్యక్రమం 
బాణాసంచా కాల్చి ఘనంగా విజయోత్సవం 
నవతెలంగాణ – తాడ్వాయి
: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో ఇటీవల మే 1న ప్రభుత్వం ప్రకటించిన పదవ తరగతి రిజల్ట్ లో మండలంలో కాటాపూర్ ప్రభుత్వ పాఠశాల మండల టాప్ ర్యాంక్ సాధించి, జిల్లలో 3వ   (ర్యాంకు) స్థానం సాధించారు. ఇందు కు కాటాపూర్ లో ప్రధాన రహదారి గుండా “ప్రైయివేటు విద్య వద్దు, గవర్నమెంట్ విద్య ముద్దు” అని నినాదాలు చేస్తూ, బాణాసంచా కాల్చుతూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం పాఠశాల  గొప్ప తనం వివరించారు. కాటాపూర్ ముందస్తుగా విన్నూత్న రీతిలో బడిబాట కార్యక్రమం కూడా నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బాణాల సుధాకర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం కాటాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో సరికొత్త రీతిలో విద్యాబోధన, ఈసారి జెడ్పిహెచ్ఎస్ పాఠశాల జిల్లా స్థాయిలో జిల్లాలో ప్రథమ స్థానం పొందే విధంగా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో లక్షల రూపాయలు వెచ్చించి పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలు కావద్దని హితవుపలికారు. పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాణాల సుధాకర్, ఉపాధ్యాయులు సక్రు నాయక్, సుతారి పాపారావు, ఉపాధ్యాయురాలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -