పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఖరీఫ్ 2025-26 సీజన్ విషయమై పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల వద్ద నుండి సేకరించిన ధాన్యంకు వెంటనే ఓ పి ఎం ఎస్ యందు ట్యాబ్ ఎంట్రీ చేయించి, మీలేలర్ అక్నౌలెడ్జిమెంట్ ఇప్పించవలసినదిగా తెలిపినారు. ఇందువల్ల రైతులకు ఎటువంటి జాప్యం లేకుండా చెల్లింపులు చేయుటకు అవకాశం ఉంటుందని, ధాన్యం, గన్ని సంచుల రీకన్సిలేషన్ పూర్తి చేయవలసినదిగా సూచించారు.
రబీ 2024-25 సిఎంఆర్ డెలివరీ విషయమై రోజువారీ టార్గెట్ ఏర్పాటు చేసుకుని, మిల్లుల వద్దనుండి 28.02.2026 లోగా సిఎంఆర్ పొందువిధముగా చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించినారు. రాబోవు రబీ (యాసంగి) పంటకాలం కొనుగోళ్లకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, సివిల్ సప్లై అధికారులు రోజారాణి, సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



