Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ విజయవంతం 

మద్నూర్ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ విజయవంతం 

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్ 
మంగళవారం మద్నూర్ రైతు వేదిక యందు విడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నట్లు మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా శనగ విత్తనాలు సబ్సిడీ పైన రైతులకు జాతీయ ఆహార భద్రత, పోషణ మిషన్(NFSNM ) పథకం ద్వారా రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమం ద్వారా శనగవిత్తనాలు పంపిణీ చేయడం జరుగును. మండల రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేసినట్లు ఏవో ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. మండలానికి 420 బస్తాల శనగ విత్తనాలు రావడం జరిగిందని తెలిపారు. సబ్సిడీ శనగ విత్తనాల కొరకు రైతులు ఆయా గ్రామాల ఏఈవో ల దగ్గర పేర్లు నమోదు చేసుకొని విత్తనాలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -