- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణానికి చెందిన కరస్పాండెంట్ విద్య గోపికృష్ణ విద్య రంగంలో చేస్తున్నా విశిష్ట కృషి కి ముఖ్య అతిథులు మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణు గోపాల చారి, వెన్నెల గద్దర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్వారీ గోపీకృష్ణ శుక్రవారం మాట్లాడుతూ.. విద్యను విద్యార్థులకు అందించడంలో చేస్తున్న సేవలకు వారు గుర్తించి గద్దర్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తు లో విద్యార్థులకు నా వంతు విద్యను అందించడంలో ముందు ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఇంచార్జ్ బాలారెడ్డి, విశిష్ట అతిథులు , పట్వారీ ప్రగతి, పట్వారీ విద్య, పట్వారీ తులసి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



