నవతెలంగాణ -భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని యాదగిరి గ్రామంలోని విద్యా జ్యోతి హై స్కూల్ కు చెందిన విద్యార్థి బాలచరణ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిప కనబరచి, ప్రశంసా పత్రాన్ని అందుకున్నట్లు పాఠశాల పిఈటి పరుశురాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఇంటర్నేషనల్ స్కూల్స్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 15 జిల్లా స్థాయి వాలి బాల్ పోటీలు జరగగా రాష్ట్రస్థాయిలో గ్రామంలోని విద్యాజ్యోతి హైస్కూల్ కి చెందిన దండ్ల బాలచరణ్ ఎంపికయ్యారు. కాగా రాష్ట్రస్థాయిలో జరిగిన అండర్ 15 వాలీబాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబడుటగా ప్రశంసా పత్రంను అందుకున్నట్లు ఆ పాఠశాల పీఈటీ పరశురాం తెలిపారు. కాగా విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రశంస పత్రాన్ని అందుకున్నందుకుగాను పాఠశాల ప్రిన్సిపాల్ వర్గీస్ స్కూల్ ఫాదర్ జోసెఫ్ భాస్కర్, వీటి ఉపాధ్యాయులు విద్యార్థికి అభినందనలు తెలిపారు.