ప్రేక్షకుల్ని చివరి వరకూ ఉత్కంఠతో కూర్చోబెట్టిన ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ మళ్లీ మీ ముందుకు వస్తోంది. ఈనెల 24, 25, 26 తేదీల్లో ఉచితంగా సీజన్ 1ను ఈటీవీ విన్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చు. ఈసారి మాత్రం కథలో కొత్త ట్విస్ట్ ఉంది. ‘చంద్రిక ఎక్కడీ’ అన్న ప్రశ్న చుట్టూ ఒక ప్రత్యేక మిస్టరీ ఛాలెంజ్ ప్రారంభమైంది. సీజన్ 1ను మళ్లీ వీక్షించి, అందులో దాగి ఉన్న క్లూస్‌ని కనుక్కొని, సరైన సమాధానం చెప్పిన అదృష్టవంతులకు ఐఫోన్ 17 గెలిచే అవకాశం ఉందని, మళ్లీ కనకం కేసులోకి దిగండి, చంద్రిక మిస్టరీని చేధించండి అని మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, ”కానిస్టేబుల్ కనకం’ సిరీస్‌కి సర్వత్రా మంచి స్పందన లభించింది. ఆద్యంతం అందర్నీ మెస్మరైజ్ చేసి, టాప్ సిరీస్‌గా నిలిచింది. అటువంటి సిరీస్‌ని ప్రేక్షకుల ముందుకు మరోమారు తీసుకురావడం ఆనందంగా ఉంది. ఆద్యంతం నవ్యతతో, ప్రేక్షకులు ఊహించని ట్విస్టులతో సాగుతూ అందర్నీ అలరించింది. ఈ సిరీస్ చూస్తూ ఇందులో ఉన్న మేం అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాల్ని పంపిస్తే, ఐఫోన్ 17ని బహుమతిగా అందజేస్తాం. ఈనెల 24, 25, 26వ తేదీల్లో ఈటీవీ విన్‌లో దీన్ని ఉచితంగా చూడొచ్చు. ”కానిస్టేబుల్ కనకం సీజన్ 2′ నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది’ అని మేకర్స్ పేర్కొన్నారు.
ఉచితంగా వీక్షించండి
- Advertisement -
- Advertisement -



