Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా పంచాయతీ కాలువల సీసీ సర్వేకు అభిప్రాయాలు ఆహ్వానం

జిల్లా పంచాయతీ కాలువల సీసీ సర్వేకు అభిప్రాయాలు ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాగ్రామ జ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 2025 –26 సంవత్సరానికి సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై కామారెడ్డి జిల్లాలో ప్రజల నుంచి అభిప్రాయాలు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీ కాలువల నిర్మాణం, మరమ్మతులు వంటి పనులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించబడిందన్నారు.

గ్రామాల్లో ఉన్న పంచాయతీ కాలువలకు ఒక క్యూబిక్ మీటరు మట్టి తవ్వకానికి రూ.1.50 లక్షలు, పక్కా నిర్మాణ పనులకు రూ.2.00 లక్షల వరకు అంచనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పనులకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా యాక్షన్ ప్లాన్‌లో భాగంగా గ్రామాల్లో ఉన్న కాలువల వివరాలు నమోదు చేసి, అవసరమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ పనులను అమలు చేయడానికి సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సిబ్బంది పాల్గొంటారని వివరించారు. అభిప్రాయాలు, ఆక్షేపణలు ఉన్న వారు ఈ నెల 17-03-2026 నుండి 24-03-2026 వరకు

https://tgobmms.cgg.gov.in⁠ వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని తెలిపారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగం అన్ని మండలాల ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్ ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -