Wednesday, January 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైస్‌మిల్లులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆకస్మిక దాడులు

రైస్‌మిల్లులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆకస్మిక దాడులు

- Advertisement -

– రూ.60 కోట్ల విలువైన అక్రమ ధాన్యం గుర్తింపు : డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ధాన్యాన్ని అక్రమంగా దారి మళ్లించడాన్ని నిరోధించేందుకు తెలంగాణ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం రైస్‌ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ రూరల్‌, హైదరాబాద్‌ సిటీ-1, హైదరాబాద్‌ సిటీ-2, నల్లగొండ, రామచంద్రాపురానికి చెందిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. మహబూబాబాద్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, సూర్యాపేట, నల్లగొండ, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో 19 రైస్‌ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించింది. మొత్తంగా 1.90 లక్షల క్వింటాళ్లకు పైగా (1.72 లక్షల బస్తాలు) ధాన్యాన్ని దారి మళ్లించినట్టు తనిఖీల్లో తేలింది. వీటి విలువ రూ. 60 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. 14 మిల్లుల్లో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ మళ్లించినట్టు గుర్తించింది. రికార్డుల నిర్వహణ సరిగా లేని ఐదు రైస్‌ మిల్లులకు నోటీసులు జారీ చేసింది. పెద్దపల్లి జిల్లాలోని జానకీరామ ఇండిస్టీస్‌ (పూసల గ్రామం) నిబంధనలను ఉల్లఘించడంతో మూసివేసింది. తప్పు చేసిన మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ నష్టాలను రికవరీ చేసేందుకు, లైసెన్స్‌లు రద్దు చేసేందుకు, అక్రమార్కులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు సివిల్‌ సప్లరు శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలోని లబ్ధిదారులకు ధాన్యం చేరేలా విజిలెన్స్‌ విభాగం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుంది. ధాన్యం దారి మళ్లింపుపై టోల్‌ ఫ్రీ నంబర్‌ 14432 ద్వారా సమాచారాన్ని అందించాలని కోరింది.
జిల్లాల వారీగా అక్రమాల ధాన్యం విలువ
కామారెడ్డి, నిజామాబాద్‌ రూ. 19.73 కోట్లు
సూర్యాపేట రూ. 19.32 కోట్లు
నారాయణపేట రూ. 15.91 కోట్లు
పెద్దపల్లిలో రూ. 11.38 కోట్లు
మహబూబాబాద్‌లో రూ. 4.86 కోట్లు
రంగారెడ్డిలో రూ. 0.88 కోట్లు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -