రక్తదాన శిబిరం ఏర్పాటు
గుంటూరు : ప్రభుత్వ యాజమాన్యంలోని షెడ్యూల్డ్ బ్యాంక్ అయిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమన్వయంతో 2025 విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ వేడుకలో భాగంగా గుంటూరులోని తన ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని విజిలెన్స్ ఇన్‌చార్జి షిన్ హర్ష్ బేతా, ఓఎస్‌డీలు శంకర్ రావు, ఎం. అరుణ్ కుమార్, ఇతర జనరల్ మేనేజర్ల సమక్షంలో బ్లాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. స్వయంగా రక్తదానం చేసిన తర్వాత చైర్మెన్, రక్తదానం అనేది ఒక సేవా కార్యమని, సేవా స్ఫూర్తి ఉన్న చోట అవినీతికి చోటు లేదని నొక్కి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన సమాజాన్ని బలోపేతం చేయడానికి దోహదపడతాయని, విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ లక్ష్యంతో సమానంగా ఉన్నాయన్నారు. ఈ గొప్ప పనిలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు బ్యాంక్ యాజమాన్యం, సిబ్బందిని రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన రాజు అభినందించారు. హెడ్ ఆఫీస్, ప్రాంతీయ కార్యాలయం, బ్యాంకు స్థానిక శాఖల నుంచి 100 మందికి పైగా సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్
- Advertisement -
- Advertisement -



