Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గురుకుల పాఠశాలను సందర్శించిన విజిలెన్స్ కమిటీ

గురుకుల పాఠశాలను సందర్శించిన విజిలెన్స్ కమిటీ

- Advertisement -

 నవతెలంగాణ – వనపర్తి  
వనపర్తి జిల్లా పరిధిలోని గోపాల్పేట్ మండలం బుద్ధారంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను వనపర్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సి.విశ్వం బాబు, ద్యారపోగు వెంకటేష్, జి వెంకటేష్, బీరప్ప, చిన్నమ్మ తామస్ లు శుక్రవారం సందర్శించారు.  పాఠశాలలోని సమస్యలను పరిస్థితులను ప్రిన్సిపాల్, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని పరిశీలించి, అక్కడే భోజనం చేశారు. వసతి గృహాన్ని, కిచెన్ రూమ్, డైనింగ్ హాల్ ను పరిశీలించారు. ఎలుకలు, కోతలు బెడద ఉందని కమిటీ సభ్యులకు వివరించినట్లు తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి కూడా తీసుకురావచ్చని ప్రిన్సిపాల్ సూచించినట్లు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -