Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పకడ్బందీగా ఇన్విజిలేషన్ విధులు నిర్వహించాలి..

పకడ్బందీగా ఇన్విజిలేషన్ విధులు నిర్వహించాలి..

- Advertisement -

వైస్ ఛాన్సలర్ టి యాదగిరి రావు..
నవతెలంగాణ – డిచ్ పల్లి 

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీజీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ( ఏపీ ఈ, ఐపిసిహెచ్ ) ఏడవ మరియు తొమ్మిదవ సెమిస్టర్ రెగ్యులర్  మూడవ రోజు బుధవారం జరిగిన పరీక్షలను తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు ఆర్ట్స్ కళాశాల లో పర్యవేక్షించారు. ఇన్విజిలేషన్ చేస్తున్న అధ్యాపకులను పకడ్బందీగా  విధులు నిర్వహించాలని అలసత్వం ప్రదర్శించరాదని  హెచ్చరించారు.  

పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి  మౌలిక సమస్యలు రాకుండా చూడాలని నిర్వాహకులను  ఆదేశించారు.అనంతరం కళాశాలలో బోధనా తరగతులను పరిశీలించారు. విద్యార్థుల హాజరును  పెంచాలని విభాగాధిపతులకు  సూచించారు. ఈ పర్యవేక్షణలో పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ పాల్గొన్నారు. బుధవారం ఉదయం జరిగిన పరీక్షకు 79 మంది విద్యార్థులకు గాను 78 మంది విద్యార్థులు హాజరు కాగా ఒక విద్యార్థి (01) గైరాజరయ్యారని పరీక్ష నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -