నవతెలంగాణ – ముధోల్
గత పది సంవత్సరాల బిఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ముధోల్ ఉమ్మడి మండలంలోని ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులపై క్యూసి ,విజిలెన్స్, విచారణ జరిపించాలని ముధోల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రావుల గంగారెడ్డి,కాంగ్రెస్ యువనాయకులు రావుల శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల మరమ్మత్తు,ఉపాధిహామీ పథకంలో నిర్మించిన సీసీ రోడ్లు,డ్రైనేజీలు అనేక అభివృద్ధి నిధులతో నిర్మించిన మొరం రోడ్లు, పీఏసిఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన వివిధ గోదాం కేంద్రాలకు వచ్చిన నిధులపై ,సిఆర్ఎఫ్, నాన్ సీఆర్ఎఫ్ కింద వేసిన బోర్ మోటార్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
బాసర ట్రిపుల్ ఐటి లో జరిగిన వివిధ అభివృద్ధి పనులపై,పేదలకు సంబంధించిన అసైన్డ్ భూముల కబ్జాలపై ,బాసర ఆలయలో వివిధ అభివృద్ధి పనుల్లో చోటు చేసుకున్న అవినీతి ని ఆధారాలతో సహా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నామని వారు పేర్కొన్నారు.వీటిపై సంబంధిత శాఖ వారు త్వరలోనే స్పందించి విచారణ జరిపించాలని అన్నారు. త్వరలోనే గత 10 సంవత్సర కాలంలో జరిగిన అవినీతిని బట్ట బయలు చేసి ప్రజల ముందు పెడతామని వారు తెలిపారు. విచారణను త్వరలోనే జరపకపోతే తాము పెద్ద ఎత్తున నిరసనకు దిగుతామని వారు హెచ్చరించారు.
గత పనులపై విజిలెన్స్ విచారణ జరపాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES