రౌడీ షీటర్లు, అనుమానితుల కధలికల పై ఆరా
రంగం లోకి స్పెషల్ పార్టీ పోలీసులు
నవతెలంగాణ – మంచిర్యాల: జిల్లా కేంద్రం లో పోలీసులు నిఘా కట్టు దిట్టం చేశారు. ఎలాంటి అవంచనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా ప్రత్యేక బృందల తో పట్టణం లో విస్తృత తనిఖిలు నిర్వహించారు. పట్టణం లో రౌడీ షీటర్స్, అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పేర్కొన్నారు.బుధవారం అర్థరాత్రి 50 మంది స్పెషల్ టీం పోలీసుల తో పట్టణంలోని పలు కాలనీలు జల్లెడ పట్టారు. అనుమానితులు, మద్యం తాగి వాహనం నడిపే వారి ని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు.గతం లో పలు కేసుల్లో నేరస్థులు గా ఉన్న వారి వివరాలు సేకరించి వారి ఇంటికి వెళ్లి ప్రస్తుత వారి స్థితి గతుల పై ఆరా తిశారు.పద్దతి మార్చుకోవాలని లేకపోతే పిడి యాక్ట్, నగర బహిష్కరణ లాంటి చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఘాటు గా హెచ్చరించారు.రౌడీ షీటర్ లు, అనుమానితులు నిత్యం అందుబాటులో లో ఉండాలని వేరే ఇతర గోడవల్లో తల దూర్చాకూడదని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతు అల్లర్లు సృష్టించే వారు ఎంతటి వారు అయిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.శాంతి భద్రతల పరిరక్షణ లో భాగం గా జిల్లా లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టనున్నట్లు డీసీపీ తెలిపారు. అయన వెంట మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, సీఐ లు ప్రమోద్ రావు, ఆకుల అశోక్ కుమార్, ఎస్ ఐ లు తిరుపతి, కిరణ్, సిబ్బంది ఉన్నారు..
నిఘా కట్టు దిట్టం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES