Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హోటల్స్ పై విజిలెన్స్ దాడులు 

హోటల్స్ పై విజిలెన్స్ దాడులు 

- Advertisement -

సిలిండర్లు స్వాధీనం..
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

వాణిజ్య అవసరాల కోసం హోటళ్లు, టిఫిన్ సెంటర్ల లో అక్రమంగా గృహ ఎల్‌పీజీ సిలిండర్లను వాడుతున్న వారిపై బాన్సువాడ విజిలెన్స్ ఇన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి సిలిండర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. శనివారం బీర్కూర్ నసురుల్లాబాద్ మండలాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి గృహ అవసర సిలిండర్లను స్వాధీనం చేసుకుని పలువురిపై కేసు నమోదు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలో సబ్సిడీ కలిగిన గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లను వాడటం చట్టరీత్యా నేరం. వాణిజ్య అవసరాలకు తప్పనిసరిగా కమర్షియల్ 19kg సిలిండర్లను మాత్రమే వాడాలని,. డొమెస్టిక్ సిలిండర్లు వాడితే జరిమానా, సిలిండర్ల సీజ్, మరియు చట్టపరమైన చర్యలు తప్పవాని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఖాజా షరీఫ్ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -