- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మైనార్టీ గురుకుల సొసైటీలో విజిలెన్స్ వ్యవస్థను ఎత్తేయాలని టీజీపీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు టీజీపీఏ అధ్యక్షులు అజయ్ కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి చట్టబద్ధత లేని విజిలెన్స్ వ్యవస్థను మైనార్టీ గురుకులంలో ఏర్పాటు చేసి వారి నివేదిక ద్వారా ఎంతో మంది ప్రిన్సిపాల్స్‌ని సస్పెండ్ చేసే చర్యలను తీవ్రంగా ఖండించారు. గురుకుల వ్యవస్థను బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్స్ పనితీరును పర్యవేక్షణ చేసేందుకు రెగ్యులర్ అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
- Advertisement -



