Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్టడీ టూర్ లో విజ్ఞాన జ్యోతి విద్యార్థులు

స్టడీ టూర్ లో విజ్ఞాన జ్యోతి విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాల విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రకు బయలుదేరి వెళ్లారు. విద్యార్థులు తమ విజ్ఞాన విహారయాత్రలో భాగంగా ఎల్లోరా గృహాలు, ఔరంగాబాద్ సందర్శించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సౌమ్య తెలిపారు. ఇలాంటి స్టడీ టూర్ లో భాగంగా  కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవడం వల్ల విద్యార్థులు చదువులో చురుకుదనాన్ని చూపుతారన్నారు. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కూడా స్టడీ టూర్లు దోహదపడతాయని తెలిపారు. ఈ విజ్ఞాన విహారయాత్రలో పాఠశాలకు చెందిన సుమారు 40 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు ఆమె వివరించారు. స్టడీ టూర్ కి వెళ్లడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -