Wednesday, May 14, 2025
Homeతాజా వార్తలువిజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' విడుదల వాయిదా

విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ విడుదల వాయిదా

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బిగ్ షాక్. హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్‌డమ్ మూవీ వాయిదా పడింది. హీరో విజయ్ దేవరకొండ… గౌతమ్ తిన్న నూరి కాంబినేషన్ లో ఈ సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన లిరికలో వీడియో, టీజర్ బీజీఎం వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఊర మాస్ యాంగిల్ లో కనిపిస్తున్నారు. పూర్తిగా గుండు గెటప్ లో మెరువబోతున్నారు విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. వాస్తవానికి ఈ నెల 30న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రం విడుదల వాయిదా వేశారు. జూన్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ ఇవాళ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -