- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా బరోడా, విదర్భ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన విదర్భ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బరోడా జట్టు బ్యాటింగ్‌కి దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బరోడా తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో పాండ్య(133, 92 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్సులు) సెంచరీతో చెలరేగాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో హార్దిక్ పాండ్యకు ఇది తొలి సెంచరీ కావడం గమనార్హం.
- Advertisement -



