– విజయలక్ష్మి సంతాప సభలో ప్రజాకవి,
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
– సీపీఐ(ఎం) నేతలు, నవతెలంగాణ సీజీఎం, సిబ్బంది నివాళులు
నవతెలంగాణ- కల్వకుర్తి టౌన్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సీపీఐ(ఎం), యూటీఎఫ్ నాయకులు దేశం వెంకట్ రెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మి పార్టీ కోసం, పేదల కోసం చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని టీఎస్ యూటీఎఫ్ భవనంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.ఆంజనేయులు అధ్యక్షతన గురువారం విజయలకిë సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. డి.వెంకట్‌రెడ్డి దంపతులు పేద ప్రజల అభ్యున్నతి కోసం చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. ఆయన వద్ద చదువుకోవడం వల్ల నాలాంటి ఎంతో మంది ఉన్నత హౌదాల్లో ఉన్నారని, ఆయన సహకారం, ప్రోత్సాహంతో దళిత సామాజిక తరగతికి చెందిన దాదాపు 200 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారన్నారు. విద్యార్థులకు సైన్సు, మూఢనమ్మకాలు, రాజకీయ విద్య పట్ల అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఉన్నత వర్గంలో పుట్టినప్పటికీ ఆయన గెజిటెడ్ హెడ్మాస్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సీపీఐ(ఎం)లో కొనసాగారని, అనేక గ్రామాల్లో భూసదస్సులు నిర్వహించారని తెలిపారు. సీలింగ్ భూములు, గైరానుభూములు భూమిలేని పేదలకు పంపిణీ చేయించారని, దానికి ఆయన సతీమణి విజయలక్ష్మి సహకారం చాలా గొప్పదని కొనియాడారు. ఆమె ఐద్వా ఉమ్మడి జిల్లా కమిటీ ఉపాధ్యాక్షురాలుగా పనిచేస్తూ పార్టీకి సేవ చేశారన్నారు.
యూటీఎఫ్ నాయకులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ప్రజాసంఘాల నాయకులు, సీపీఐ(ఎం) నాయకులు, సానుభూతిపరులు పెద్దఎత్తున పాల్గొని విజయలకిëకి నివాళులర్పించారు. ఆమెకు నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్, జీఎం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర మొఫిసియల్ ఇన్‌చార్జి జి.వేణు మాధవరావు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.
విజయలక్ష్మి, వెంకట్ రెడ్డి సేవలు మరువలేనివి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES