Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రైతాంగా నూతన ఒరవడికి "వికసిత్ కృషి "

రైతాంగా నూతన ఒరవడికి “వికసిత్ కృషి “

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి
రైతాంగ నూతన ఒరవడికి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఒక కొత్త చరిత్ర సృష్టిస్తుందని మండల వ్యవసాయ శాఖ అధికారి గుమ్మడి వీరభద్రం అన్నారు. బుధవారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ గురించి ఒక ప్రకటన వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు పంటల సాగు వ్యయాన్ని తగ్గించడం, నూతన ఆవిష్కరణలపై రైతులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ నెల 30 నుంచి జూన్ 12 వరకు మండలంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ నిర్వహించనున్నాట్లు తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొంటారు అని పేర్కొన్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి సంస్థలైన భారత వరి పరిశోధన సంస్థ, నూనె గింజల పరిశోధన సంస్థ, చిరుధాన్యాల పరిశోధన సంస్థ, జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ, జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ తదితరాలు సైతం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఎంపిక చేసిన గ్రామాలకు ముగ్గురేసి శాస్త్రవేత్తలు వెళ్లి రైతులతో సమావేశమవుతారని వెల్లడించారు. పంట క్షేత్రాలను సందర్శించి ఎలాంటి పంటలు సాగు చేయాలి అనేదానిపై రైతులకు పురంక సంఘాల వివరించడం జరుగుతుందన్నారు. ఆధునిక పరికరాల వినియోగంతో స్మార్ట్ వ్యవసాయాన్ని పద్ధతులను తెలియజేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయ డ్రోన్ల ప్రత్యక్ష ప్రదర్శనలు పంట వైవిధ్యీకరణ, యంత్ర ఆధారిత వ్యవసాయం గూర్చి రైతులకు వివరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad