– రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిరంజీవి ముదిరాజ్
నవతెలంగాణ – కామారెడ్డి
గ్రామ పరిపాలన అధికారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికై ఈనెల 23న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రామ పరిపాలన ఉద్యోగ అసోసియేషన్ నూతన ఆవిర్భావ సభను ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిరంజీవి ముదిరాజ్ కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీపిఓ ఉద్యోగుల హక్కులను, ఆత్మగౌరాన్ని కాపాడుకోవడానికి ఈ సభలో చర్చించడం జరుగుతుందన్నారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యోగుల ఐక్యతను చేర్చి మహాశక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ ఆవిర్భావ సభకు ముఖ్య అతిథులుగా రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి.అచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ లు హాజరవుతారన్నారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి జిపీఓలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో దుబాషి మాణిక్యం, సూరజ్ కుమార్, సంజీవులు, అశోక్, భాస్కర్ రాజు సాయిలు, బలరామ్ రవి, సంతోష్ రెడ్డి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.



