నవతెలంగాణ – నెల్లికుదురు
నెల్లికుదురు మండలంలోని 14 రెవిన్యూ క్లస్టర్ లోని 14 మంది గ్రామ పరిపాలన అధికారులు విధుల్లో చేరారని తహశీల్దార్ చందా నరేష్ తెలిపారు. శుక్రవారం జిపిఓ లకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 14 రెవిన్యూ రెవిన్యూ క్లస్టర్లని 15 రెవెన్యూ గ్రామాలని వీటికి 14 గ్రామ పరిపాలన అధికారులు విధులు చేరాలని అన్నారు. ఇన్ని రోజులు వీరు లేక కొన్ని భూ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేకపోయాయని ఇప్పుడు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు . మండలంలోని రెవిన్యూ క్లస్టర్ ల వీరు విధుల్లో జిపిఓ లుగా చేరిన వివరాలు ఇలా ఉన్నాయి.
మేచరాజు పల్లి రెవిన్యూ క్లస్టర్ అయినా రెవిన్యూ గ్రామము మేచరాజుపల్లి జిపిఓగా ధారావత్ గోపి సింగ్, ఎర్రబెల్లి గూడెం రెవిన్యూ క్లస్టర్ ఆయన రెవిన్యూ గ్రామం ఎర్రబెల్లి గూడెం, రామంజపురం గ్రామ జిపిఓగా పులుగుజ్జ మధుసూదన్, బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ రెవెన్య క్లస్టర్ జిపిఓగా అరిగే సందీప్, కాచికల్ గ్రామ రెవిన్యూ క్లస్టర్ జిపిఓగా నార బోయిన వెంకటరమణ, నైనాల గ్రామ రెవెన్యూ క్లస్టర్ జిపిఓగా మురళి అని రెడ్డి, నెల్లికుదురు రెవిన్యూ క్లస్టర్ జిపిఓగా గంగినేని ఉప్పలయ్య, రాజుల కొత్తపల్లి గ్రామ రెవిన్యూ క్లస్టర్ జిపిఓగా పెసరు రమేష్, ఆలేరు రెవిన్యూ క్లస్టర్ జిపిఓ గా జనార్ధన్, నరసింహుల గూడెం రెవిన్యూ క్లస్టర్ జిపిఓగా కె నవీన్, వావిలాల రెవిన్యూ క్లస్టర్ జిపిఓగా లకావత్ దివ్య భారతి, శ్రీరామగిరి రెవిన్యూ క్లస్టర్ జిపిఓగా గుమ్మడి విజయ, మదనతుర్తి రెవిన్యూ క్లస్టర్ జిపిఓగా బిక్షపతి, మునిగలవీడు రెవిన్యూ క్లస్టర్ జిపిఓగా షేక్ అఫ్జల్, రావిరాల రెవిన్యూ ప్లాస్టర్ జిపిఓగా ఉపేంద్ర వెలిశాల, వీరు ఆయా గ్రామాలలో జి పి ఓ లుగా విధులలో చేరారని తాసిల్దార్ నరేష్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం విధుల్లో చేరిన ప్రతి ఒక్కరు గ్రామాల్లో విధులు చేపట్టాలని తగు సూచనలను చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రామకృష్ణ సీనియర్ అసిస్టెంట్ బాబు సిబ్బంది పాల్గొన్నారు .
విధుల్లో చేరిన గ్రామ పరిపాలన అధికారులు: తహశీల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES