- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో గ్రామ పాలనాధికారులు(జీపీవో)లు శుక్రవారం విధుల్లో చేరారు. ఇటీవల అర్హత పరీక్ష నిర్వహించగా మండలానికి ఏడుగురిని కేటాయించారు. మండలంలో ఏడు క్లస్టర్లు ఉండగా తాడిచెర్ల-1కు సాంబయ్య, తాడిచెర్ల-2కు స్వర్ణలత, వల్లెంకుంట గ్రామానికి రాజేందర్, రుద్రారం గ్రామానికి శ్రీనివాస్, మల్లారం గ్రామానికి రాజు, నాచారం గ్రామానికి సంపత్, పెద్దతూండ్ల గ్రామానికి మేడిపలి రాజును కేటాయించినట్లు తహసీల్దార్ రవికుమార్ తెలిపారు.
- Advertisement -