నవతెలంగాణ – తిమ్మాజిపేట
గ్రామ అభివృద్ధి జరగాలంటే గ్రామంలోని ప్రజలందరి సహకారం ఉంటేనే సాధ్యమని గ్రామ సర్పంచ్ కవిత భక్తవత్సలం అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో కవితా భక్తవత్సలం ఆధ్వర్యంలో మొట్ట మొదటి గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి జరగాలంటే గ్రామంలోని ప్రజలందరూ సహకారం ఉంటేనే గ్రామం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సక్రమంగా ఉపయోగించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ 40 రోజులలో గ్రామంలోని 12 వార్డులలో మురికి తుమ్మ చెట్లను తొలగించి దీంతోపాటు అన్ని వార్డులలో విద్యుత్ స్తంభాలకు లైట్లు వేసి గ్రామంలోని డ్రైనేజీలు తీయడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేటట్లు చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాములు నాయక్ ఉపసర్పంచ్ పి స్వామి వార్డు సభ్యులు తిరుపతయ్య శేఖర్ యాదవ్ దానం రేణుక, వాసవి, అంజమ్మ, స్వరూప, సైఫుద్దీన్, చెవ్వ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి మహేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



