జిల్లా కలెక్టర్ హనుమంతరావు ….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : గ్రామ పలనాధికారి పరీక్షలు రాసి అభ్యర్థులు హాల్ టికెట్పై కాలర్ పాస్పోర్ట్ను తప్పనిసరి అతికించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో మే, 25 వ తేదీ న భువనగిరి పట్టణంలోని వెన్నెల కాలేజీ లో నిర్వహించే గ్రామ పాలన అధికారి పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పాలన అధికారి పరీక్షలు వ్రాసే అభ్యర్థులు హాల్ టికెట్ పై కలర్ పాస్ ఫోటో ను అతికించాలని, ఫోటో పై తాను పని చేస్తున్న డిపార్ట్మెంట్ కంట్రోల్ అధికారి ధ్రువీకరణ సంతకం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అదే రకమైన మరొక కలర్ పాస్ ఫోటో ను వెంట తెచ్చుకోవాలని, అదే విధంగా ఆధార్ కార్డ్ ను తెచ్చుకోవాలని అభ్యర్థులకు సూచించారు.పరీక్ష వ్రాసే అభ్యర్థులు బ్లూ బాల్ పెన్ లేక బ్లాక్ బాల్ పెన్ గాని వెంట తెచ్చుకోవాలన్నారు. ఆదివారం ఉదయం 10.30 నుంచి 1.30 వరకు నిర్వహించబడు తుందన్నందున అభ్యర్థులు ఉదయం 9గంటల కే పరీక్ష కేంద్రం చేరుకోవాలని, 10 గంటలకు గేటు మూసి వేయడం జరుగుతుందని, 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించడం జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులను కల్పించాలన్నారు. అభ్యర్థులు తమ వెంట సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్, గడియారం, వంటి తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదని తెలియజేశారు. పరీక్షా కేంద్రం పరిధిలో సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. యాక్ట్ ప్రకారం నిషేధిత ఆజ్ఞలు అమలులో ఉంటాయని, పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి జిరాక్స్ షాపులు పరీక్షల సమయంలో మూసివేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థుల హాజరు నమోదు చేసి వెంటనే నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డిఓ కృష్ణారెడ్డి, వెన్నెల కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ వరప్రసాద్, డిటిఓ సంపూర్ణ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి ప్రధానోపాధ్యాయులు రంగరాజన్, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
గ్రామ పాలన అభ్యర్థులు హాల్ టికెట్ పై ఫోటో ను అతికించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES