నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని 30 గ్రామాల సర్పంచులు గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళా భారతి ఆడిటోరియంలో ఒకరోజు శిక్షణ తరగతులకు హజరయ్యారని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ జుక్కల్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి చేయవలసిన విధులు శిక్షణ పొందిన వారికి ప్రశంసా పత్రాలు అందించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సర్పంచులు మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చాలని ఉద్దేశంతోనే విద్యావంతులైన యువతి, యువకులైన సర్పంచులు అత్యధికంగా జుక్కల్ మండలంలోని ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. ప్రస్తుతం మా దృష్టి అంత గ్రామాల అభివృద్ధిపైనే కేంద్రీకరిస్తామని ప్రభుత్వ సహకారంతో సహకారం చేస్తామని అన్నారు.



