నవతెలంగాణ రెంజల్:
రెంజల్ మండలం తాడి బిలోలి గ్రామ కార్యదర్శిగా గత మూడు సంవత్సరాలుగా బాధ్యతలను నిర్వర్తించిన రాఘవేందర్ గౌడ్ ఇటీవల బదిలీ కావడంతో, మండలంలోని గ్రామ కార్యదర్శిలు ఆయనకు శాలువలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానం జరిపారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి జీవో నెంబర్ 317 క్రింద ఇక్కడికి డిప్యూటేషన్ పై రాగా, తిరిగి 190 జీవో ద్వారా తన సొంత జిల్లాకు బదిలీపై వెళ్లడంతో గ్రామ కార్యదర్శిలు ఆయనను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వి కమలాకర్, గ్రామ కార్యదర్శులు రాజేందర్ రావు, మహబూబ్ అలీ, నవీన్, జాజు శ్రీకాంత్, సునీల్ యాదవ్, శివ కృష్ణ, బి రాణి, సాయిబాబా, సీనియర్ అసిస్టెంట్ రఫీ అన్వర్, ఏపీవో రమణ, టి ఏ లు రాజేశ్వర్ ,దేవి సింగ్, కంప్యూటర్ ఆపరేటర్ శివప్రసాద్, నితీష్, మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



