- Advertisement -
నవతెలంగాణ – బజార్‌హత్నూర్
మండలంలోని భూతాయికే గ్రామంలో జరిగిన ఒక పెళ్లికి గ్రామస్తులు ఐకమత్యాన్ని చాటుతూ గురువారం రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాడవి సింధు, గ్రామ పటేల్ తొడసం వినాయక్‌రావు మాట్లాడుతూ..గ్రామంలో జరిగే ప్రతి శుభకార్యానికి గ్రామస్తులంతా కలిసికట్టుగా సహకారం అందించడం సాంప్రదాయంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాజన్ మాడవి సంతోష్, దేవరి నగోరావు, మాజీ సర్పంచ్ తొడసం మారుతి, మాడవి జైతు, పోయాం మంతూ, పోయాం లక్ష్మణ్, తొడసం చందు, తొడసం చంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


