నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఎమ్మార్వో ను మండలంలోని ఖండేబల్లూర్ గ్రామస్తులు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఇటీవలే జుక్కల్ మండలానికి నూతనంగా ఎమ్మార్వో గా పదవీ బాధ్యతలు చేపట్టిన మారుతి గతంలో రుద్రూర్ ఎమ్మార్వో గా విధులు నిర్వర్తించి జుక్కల్ మండలానికి బదిలీపై వచ్చారని అన్నారు. సందర్భంగా ఎంఆర్ఓ మారుతి మాట్లాడుతూ.. మారుముల జుక్కల్ మండలం ప్రాంతంలో గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు నేరుగా తన కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎవరి సిఫార్సులు అనుమతించబడవని, నేరుగా లబ్ధిదారులే తన వద్దకు వచ్చి సమస్యలను తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శివరాజ్ దేశాయ్ , కొమ్ము శ్రీనివాస్ , కొమ్ము రాజు, నాగనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్ ఎమ్మార్వోను సన్మానించిన గ్రామస్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES