Friday, March 20, 2026
E-PAPER
Homeకరీంనగర్తహశీల్దార్ ను కలిసిన మహితాపూర్ గ్రామస్థులు

తహశీల్దార్ ను కలిసిన మహితాపూర్ గ్రామస్థులు

- Advertisement -

నిధులు ఉన్నాయి.. హద్దులు చూపండి
నవతెలంగాణ – రాయికల్
భూమి సరిహద్దుల వివాదంతో రోడ్డు పనులు నిలిచిపోవడంతో మహితాపూర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు రాయికల్ తహసీల్దార్‌ నాగార్జునను ఆశ్రయించారు. సమస్యను వెంటనే పరిష్కరించి పనులు పూర్తిచేయాలని వినతిపత్రం సమర్పించారు. శ్రీగిరిగుట్ట (గన్నేగుట్ట)పై ఉన్న కనకదుర్గాదేవి ఆలయానికి మెయిన్ రోడ్డునుంచి సిమెంట్ రహదారి నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు దామోదరరావు నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరయ్యాయని, పనులు ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ భూమికి పక్కనే ఉన్న పట్టాదారుల అడ్డంకులతో రోడ్డు నిర్మాణం నిలిచిపోయినట్లు వారు పేర్కొన్నారు.

రెవెన్యూ, సర్వే అధికారులు సరిహద్దులు నిర్ధారిస్తే పనులు పూర్తవుతాయని, లేదంటే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బత్తిని శ్రీనివాస్, తొగిటి నవీన్, అనుమల్ల రమ, బూస గంగామల్లయ్య, భూపల్లి పరమేష్, స్థానిక నాయకుడు సత్యనారాయణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -