Friday, October 24, 2025
E-PAPER
Homeజిల్లాలుకోళ్ల ఫారం ముందు గ్రామస్థుల నిరసన..

కోళ్ల ఫారం ముందు గ్రామస్థుల నిరసన..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మండలంలోని వడాయిగూడెం  గ్రామం సమీపంలో ఉన్న తిరుమల హర్చరీస్  ప్రైవేట్ లిమిటెడ్ కోళ్ల ఫారం నుండి దుర్వాసన రావడంతో ఈరోజు గ్రామస్తులు కోళ్ల ఫారం గేటు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దుర్గాదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బబ్బూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో కోళ్ల ఫారం నుంచి వచ్చే దుర్వాసనతో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోళ్ల ఫారం యజమాన్యం పట్టించుకోకపోవడంతో గ్రామంలో ఈగలు వల్ల అనారోగ్య పాలు అవుతున్నారని తక్షణమే యజమాన్యం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ కోళ్ల ఫారం యజమాన్యానికి వినతి పత్రం అందజేశారు.  ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు బబ్బూరి సాగర్ గౌడ్, బిజెపి గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బబ్బూరి పెద్ద శంకర్ గౌడ్, మాటూరి శంకర్ గౌడ్, బండారి మల్లేష్, ఇల్లా సత్యనారాయణ, చుక్కల స్వామి, బత్తిని క్రాంతి, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -