Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లె వెలుగు బస్సుల కోసం పడిగాపులు

పల్లె వెలుగు బస్సుల కోసం పడిగాపులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే పల్లె వెలుగు బస్సులు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు బస్సు ఇక్కట్లు తప్పట్లేదు. రెగ్యులర్గా వెళ్లే బస్సులు కూడా వాటిని రద్దుచేసి ఉన్న బస్సులను మేడారం జాతర అనే పేరుతో అక్కడికి పంపడంతో ఇటు గ్రామీణ ప్రాంతాలలో నివసి స్తున్న పేద వర్గాల వారికి అష్ట కష్టాలు పడుతున్నారు. బాన్సువాడ నుండి వచ్చే బిచ్కుంద – మాలేగావ్ బస్సును మహారాష్ట్రకు పోయేది ప్రస్తుతం రద్దు చేశారు. జుక్కల్ – దెగ్లూర్ పోయే బస్సు కూడా రద్దు అధికారులు రద్దు చేశారు. ఈ రెండు బస్సులు కూడా వేళల్లో టిఎస్ఆర్టిసి కి ఆదాయం వచ్చి ఉండేది.

ఆర్టీసీకి నష్టం జరగడానికి కారణం ఇట్లాంటి అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం, సమ్మక్క సారక్క జాతర అని చెప్పి సాకుతో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రయాణికులు వాపోయారు. నిత్యం భారీ మొత్తంలో ఆర్టీసీకి ఆదాయం జరిగే మార్గాలను రద్దుచేయడం వలన గ్రామీణ ప్రాంత ప్రజలకు దూరప్రాంతాలకు వెళ్లే వారికి సమస్యలు తలెత్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ తీరును మార్చుకోవాలని ఉన్న బస్సులన్నీ తీసుకెళ్లి జాతరల పేర్లతో అక్కడ తిప్పడం కన్నా ఇక్కడ ప్రాంత ప్రజలకు పల్లె వెలుగులు కనబడకపోవడం వారి జీవితాల్లో చీకటి నింపిన విధంగా తయారైంది.

పాఠశాలలకు వెళ్లే పిల్లలకు దూరం నుండి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పలు శుభకార్యాలకు , మంచి , చెడులకు  వచ్చే వారికి నడిచి వెళ్లే దుస్థితి నెలకొంది. లేకుంటే డబ్బున్నవారైతే ప్రైవేట్ వాహనాలో గమ్యాన్ని చేర గలుగుతున్నారు. కటిక దరిద్రం అనుభవిస్తున్న పేద ప్రజలు ఎంతో ఆశలతో బస్సులు వస్తాయని బస్టాండ్ ప్రాంతంలో నిలబడి , నిలబడి వారికి ఓపిక నశించడంతో ఇదేమి ప్రభుత్వం ఇదేమి గత్యంత వచ్చి పడింది అని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. డిమాండ్ పెరిగింది. వారు అడిగినంత డబ్బులు ఇస్తేనే వారు గమ్యాన్ని చేర్చగలుగుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -