Thursday, March 12, 2026
E-PAPER
Homeజిల్లాలుదేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు

దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు

- Advertisement -

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు భాగస్వాములు కావాలి..

పంచాయతీ రాజ్ లో సమూల మార్పులు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే

గ్రామస్థాయిలో సర్వాధికారాలు సర్పంచులదే

సర్పంచులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నవతెలంగాణ డిచ్ పల్లి

పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రస్తుతం పటిష్టంగా కొనసాగడానికి ప్రధాన కారణం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సమూల మార్పులే అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా గురువారం డిచ్ పల్లి మండలంలోని బర్దిపూర్ శివారులోని అమృత గార్డెన్ లో జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్.ఆర్.భూపతి రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకు ముందు రాష్ట్ర గేయాన్ని ఆలపించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మేల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచులు సమర్థవంతంగా పనిచేసినప్పుడే రాష్ట్రం,దేశం అభివృద్ధి పథంలో నడిచేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, ఇతరత్ర అభివృద్ధి పథకాలను గ్రామస్థాయిలో అమలు చేసే బాధ్యత సర్పంచులదేనని పునరుద్ఘాటించారు. గ్రామస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలు, మహిళా భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అనేది సర్పంచుల ప్రథమ కర్తవ్యమని గుర్తు చేశారు. గ్రామ ప్రజలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి విషయంలో పార్టీలకు తావులేకుండా ముందుకు వెళ్లాలని సూచించారు.

గ్రామస్థాయిలో పరిష్కారానికి యోగ్యమైన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని పరిష్కారం కానీ సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచుల్లో అధిక శాతం మహిళలు, యువ నాయకులే ఉన్న నేపథ్యంలో అందరు కష్టపడి ప్రజా పాలన చేస్తే.. మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ రాష్ట్ర చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపెల్లి సాయిరెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డిఆర్డీఓ పిడి సాయ గౌడ్, డిపీఓ శ్రీనివాస్ రావు, డిఎల్పిఓ లు  ఆయా మండలాల ఎంపీడిఓ అనంత్ రావు,ఎంపిఓ లు శ్రీనివాస్ గౌడ్, రాజ్ కాంత్ రావు, పంచాయతీ రాజ్ అధికారులతో పాటు సర్పంచుల ఫోరం రూరల్ అధ్యక్షులు గొట్టిపాటి వాసు, సుదర్శన్ నాయక్ (సుధర్), సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -