- Advertisement -
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ – కట్టంగూర్
కొత్తగా ఎన్నికైన సర్పంచులు పార్టీలకతీతంగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఐటిపాముల, ఈదులూరు గ్రామాలలో బిఆర్ఎస్ తరపున గెలుపొందిన సర్పంచులు బెల్లి సుధాకర్, ఇప్పలపల్లి అనితశ్రీను లను సోమవారం శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ, నాయకులు పెద్ది బాల నరసింహ, గాజుల బుచ్చమ్మ, నకిరేకంటి నరసింహ, ఉప సర్పంచ్లు చింత నాగార్జున, గోపగోని లింగమ్మ వార్డు సభ్యులు ఉన్నారు.
- Advertisement -



