Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంవిమలా రణదివే పోరాట ధీశాలి

విమలా రణదివే పోరాట ధీశాలి

- Advertisement -

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి విమలా రణదివే అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ కొనియాడారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో విమలా రణదివే 26వ వర్థంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎస్వీ.రమ పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌, ఆఫీస్‌బేరర్లు పుష్పగుచ్చాలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. ఒక సందర్భంలో తెలిసీతెలియక స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్నానని చెబితే వదిలిపెడతామని పోలీసులు సూచించగా..ఆమె ధైర్యంగా నిరాకరించారని కొనియాడారు. మహారాష్ట్రలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కార్మిక వర్గ విముక్తి కోసం పనిచేశారనీ, అనేక యూనియన్లకు నాయకత్వం వహించారని గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించారన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వ్యవస్థాపక సభ్యులుగా, శ్రామిక మహిళా సమన్వయ కమిటీకి వ్యవస్థాపక జాతీయ కన్వీనర్‌గా, అంగన్‌వాడీ యూనియన్‌కు వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారని చెప్పారు. నేడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గంపైనా, మహిళలపైనా జరుగుతున్న దాడులను తిప్పికొట్టడమే ఆమె ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad