Saturday, February 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌గా వినయ్ కుమార్‌

చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌గా వినయ్ కుమార్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌గా 1992 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి వినయ్ కుమార్‌ (పీసీసీఎఫ్‌)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు దశాబ్దాలకుపైగా అటవీ పరిపాలన అనుభవం కలిగిన ఆయన గతంలో అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల శాఖల్లో వివిధ కీలక హోదాల్లో సేవలందించారు. ఆదిలాబాద్‌ డీపీఏపీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా, కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌గా పని చేశారు. తెలంగాణలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌గా పని చేసిన ఆయన, వరల్డ్‌ బ్యాంక్‌, జైకా సహకారంతో అమలైన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. నీటి వనరుల సుస్థిర నిర్వహణలో చేసిన కృషికి గాను 2014లో ఐక్యరాజ్యసమితి ‘వాటర్‌ ఫర్‌ లైఫ్‌’ అవార్డులో ఫస్ట్‌ రన్నర్‌-అప్‌గా గౌరవం పొందారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్‌ మాట్లాడుతూ, ”ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అటవీ పరిరక్షణ చర్యలను మరింత బలోపేతం చేస్తాం” అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -