- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్సై శంషుద్దీన్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ నేపథ్యంలో , వినాయక మండపాలకు ఉత్సవ కమిటీలు పోలీసుల అనుమతి తప్పకుండా తీసుకోవాలన్నారు. మండపాలను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయొద్దని ఇతర మతల వారికి ఇబ్బంది కలగజేయొద్దని కోరారు. డీజే లకు ఎలాంటి అనుమతి లేదన్నారు. ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని అన్నారు. పోలీసుల సూచనలు ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
- Advertisement -