Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: మంత్రి శ్రీధర్ బాబు

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల, మంథని నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మంగళవారం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినాయక చవితి పండుగను శాంతి, సమన్వయ వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రతిష్ఠించిన విగ్రహాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని జిల్లా యంత్రాంగం అన్ని  పకడ్బందీ పర్యవేక్షణ  చేయాలని సూచించారు.

విగ్రహాల ప్రతిష్ఠాపన నుండి నిమజ్జనాల వరకు ఎటువంటి అంతరాయం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, నిర్దేశించిన ప్రాంతాల్లోనే  నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా భక్తులకు సూచించారు. ప్రజలందరూ యంత్రాంగం సలహాలు, సూచనలు పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా వినాయక చవితి పండుగను, నవరాత్రులను దిగ్విజయంగా  జరుపుకోవాలని తెలిపారు. ముఖ్యంగా విగ్రహాలు ప్రతిష్ఠ లో  విద్యుత్ ప్రమాదాలు వాటిల్లకుండా రక్షణ చర్యలు పాటించాలన్నారు.  వర్షం వల్ల విద్యుత్తు ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -