– కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో వినాయక నవరాత్రులు, నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిసినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. ప్రజలందరి సహకారం వల్లే మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు విజయవంతమైనట్లు ఆయన పేర్కొన్నారు.మండలంలో గణేష్ నిమజ్జన శోభయాత్రను ఎలాంటి అవాంఛనియా సంఘటనలు జరగకుండా విజయవంతం కావడానికి సహకరించిన ప్రజలకు, గ్రామాభివృద్ధి కమిటీలకు, సంబంధిత శాఖ అధికారులకు, సిబ్బందికి, నాయకులకు, యువకులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మండలంలో వినాయక మండపాలను నెలకొల్పిన సభ్యులు ఇన్ టైం లోనే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ముగించినందుకు, ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ సిబ్బంది, ఎస్ఐ అనిల్ రెడ్డికి హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. కాగా మండలంలో వినాయక నిమజ్జనం చివరి రోజైన శనివారం రాత్రి ఓం పద్మశాలి విజయ సంఘం కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రజలను ఆకర్షించింది. నిమజ్జనోత్సవాన్ని పద్మశాలి కుల బాంధవులు
భక్తిశ్రద్ధలతో, సంప్రదాయంగా ఘనంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులు, భాజా భజంత్రీల చప్పుడుతో మట్టి వినాయక విగ్రహాన్ని శోభాయాత్రగా తీసుకువెళ్లి వరద కాలువలో నిమజ్జనం చేశారు.