- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం వినాయక నిమజ్జనం ఉత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. వినాయక నిమజ్జన సందర్భంగా ఎలాంటి హంగు హర్ బాటా లకు తావులేకుండా సాంప్రదాయ పద్ధతిలో యువకులు వినాయకులను నిమజ్జనం చేశారు. డిజె సప్పులు లేకుండా కొందరు డప్పుసప్పుల మధ్య, భజనలు చేస్తూ మరికొందరు, మహిళల మంగళ హారతుల శోభయాత్ర మధ్య ఊరేగింపుగా వినాయక విగ్రహాలను తీసుకెళ్లి సమీపంలోని చెరువుల్లో, వరద కాలువలో నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జన ప్రదేశాల్లో గ్రామ పంచాయితీ, పోలీస్ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. మండలంలో వినాయక నిమజ్జనం సభలు ప్రశాంతంగా సాగడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -