Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా వినోద్ 

కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా వినోద్ 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి : కాంగ్రెస్ పార్టీ నిజాంబాద్ రూరల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా వినోద్ కు నియామక పత్రాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అందజేశారు.    డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో బృందావన్ గార్డెన్ లో రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో భాగంగా నిజాంబాద్ రూరల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా సోప్పరీ వినోద్ ముదిరాజ్,  ధర్పల్లి మండలానికి చెందిన అనిల్ ను కన్వీనర్ గా నియమించినందుకు నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు . ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. మా మీద నమ్మకం ఉంచి ఇంత మంచి అవకాశం  ఇచ్చినందుకు మేము దానిని సక్రమంగా వినియోగిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. ఈ ఎంపికకు సహకరించిన జిల్లా యువజన నాయకులకు కృతజ్ఞతలు అని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మాజీ నరేష్ కి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగా రెడ్డి కి,  ఐ డి సి ఎం ఎస్ మాజీ  చైర్మన్ మునిపల్లీ పెద్ద   సాయి రెడ్డి, మాజీ సర్పంచ్ లు చిన్న సాయి రెడ్డి, కాటిపల్లి నర్సారెడ్డి, సొసైటీ చైర్మన్ అర్గుల్ ఆర్మూరు గంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి , కార్యక్రమంలో  నాట్ట తిరుపతి, పవన్ కళ్యాణ్, వినోద్, శీను, రమణ, సాయి,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -