Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఏకాభిప్రాయాన్ని ఉల్లంఘిస్తున్నారు

ఏకాభిప్రాయాన్ని ఉల్లంఘిస్తున్నారు

- Advertisement -

అమెరికాపై చైనా ఆగ్రహం
బీజింగ్‌ : జెనీవాలో అమెరికా, చైనా మధ్య ఆర్థిక, వాణిజ్య చర్చల సందర్భంగా కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమెరికా తీవ్రంగా ఉల్లంఘిస్తోందని చైనా తీవ్రంగా విమర్శించింది. చైనాపై వరుసగా పలు వివక్షాపూరితమైన, ఆంక్షలతో కూడిన చర్యలను తీసుకుంటోందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సోమవారం విమర్శించారు.ఏఐ చిప్‌ ఎగుమతుల నియంత్రణలుపై మార్గదర్శకాలు జారీ చేయడం, చైనాకు కంప్యూటర్‌ చిప్‌ డిజైన్‌ సాఫ్ట్‌వేర్‌ విక్రయాలను నిలుపుచేయడం, చైనా విద్యార్ధులకు వీసాలను రద్దు చేయడం వంటి చర్యలు అందులో వున్నాయని ఆయన చెప్పారు. జనవరి 17న ఇరు దేశాల అధిపతుల మధ్య ఫోన్‌కాల్‌ సందర్భంగా కుదిరిన అవగాహనను ఈ చర్యలన్నీ తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయని ఆయన తెలిపారు. తద్వారా చైనా చట్టబద్ధమైన హక్కులకు, ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలుగుతోందని అన్నారు. ”తన స్వంత చర్యలపై స్పందించడానికి బదులుగా అమెరికా, ఏకాభిప్రాయాన్ని ఉల్లంఘి స్తోందం టూ చైనాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది. ఇది వాస్తవాలను పూర్తిగా వక్రీకరిస్తోంది. ఏ మాత్రమూ సమర్ధనీయం కాని ఈ ఆరోపణలను చైనా నిర్ద్వందంగా తిరస్కరిస్తోంది.” అని ఆ ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికా పరస్పర టారిఫ్‌లకు వ్యతిరేకంగా తీసుకున్న సంబం ధిత టారిఫ్‌లు, టారిప ˜్‌యేతర చర్యలను చైనా రద్దు చేయడమో లేదా నిలుపు చేయడమో జరిగిం దని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి తెలిపారు. చైనా బాధ్యతాయుతమైన రీతిలోనే వ్యవహరించిందన్నారు. జెనీవా అవగాహనను సీరియస్‌గా, కచ్చితంగా అమలు చేస్తోందన్నారు. దాన్ని చురుకుగా పరిరక్షిస్తోందన్నారు. తన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడంలో చైనా ధృఢంగా వ్యవహరిస్తుందన్నారు. అమలులో నిజాయితీగా వున్నామని చెప్పారు. ఎంతో కష్టపడి ఆ అవగాహనను సాధించుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. అదే దిశగా చైనాతో కలిసి పనిచేయాల్సిందిగా ఆయన అమెరికాను కోరారు. తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, చర్యలను సరిదిద్దుకో వాలన్నారు. ఏకాబి óప్రాయాన్ని పరిరక్షించుకోవాలన్నారు. చైనా-అమెరికా ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆరోగ్యకరంగా, సుస్థిరంగా, నిలకడగా వుండేలా చూసు కోవాల్సి వుందన్నారు. అయినా అమెరికా తన తీరును మార్చు కోకపోతే చైనా కచ్చితంగా తీవ్రంగానే వ్యవహరించాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad