Saturday, May 17, 2025
Homeట్రెండింగ్ న్యూస్ఘోరం..ఫ్లష్‌ చేయడంతో పేలిన టాయిలెట్‌ సీటు..

ఘోరం..ఫ్లష్‌ చేయడంతో పేలిన టాయిలెట్‌ సీటు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఫ్లష్‌ చేయడంతో టాయిలెట్‌ సీటు పేలింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని నోయిడాలో అషు అనే వ్యక్తి టాయిలెట్‌ను వినియోగించిన తర్వాత ఫ్లష్‌ చేయడంతో అది పేలింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మురుగునీటి పైపుల్లో మీథేన్ వాయువు పేరుకుపోవడం ఈ పేలుడుకు కారణంగా తెలుస్తోంది. 35 శాతం కాలిన గాయాలైన అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి ఘటన జరగడం తొలిసారి అని, ఐ. ఐ.టీ నిపుణుల సహాయం తో పరిశీలించి దర్యాప్తు చేస్తామని అధికారులు వెల్లడించారు.
అయితే ఈ సంఘటన బయటకు రావడంతో జనాలందరూ భయపడిపోతున్నారు. ఫారం టాయిలెట్స్ లో బాత్రూం పోయేందుకు భయపడిపోతున్నారు. ఇలా పేలుడం వింతగా ఉందని కొంతమంది ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -