- Advertisement -
హైదరాబాద్ : విరూపాక్ష ఆర్గానిక్స్ రూ.740కోట్ల ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించినట్టు తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన ఈ ఫార్మా కంపెనీ తన వ్యాపార విస్తరణ, రుణాల చెల్లింపులకు ఈ నిధులను ఉపయోగించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం 6తయారీ యూనిట్లను నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 550 మందికి పైగా క్లయింట్‌లకు సేవలు అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.811 కోట్ల ఆదాయం ద్వారా రూ.78 కోట్ల నికర లాభాన్ని సాధించింది.
- Advertisement -


